ఇలా యూఎస్ఏ లో కూడా భారీ కలెక్షన్స్ తో పాటుగా ఏడాది యావరేజ్ గా హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నార్త్ అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక మైల్ స్టోన్ గా మిగిలి పోయిందట..2.5 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కును సైతం అందుకున్నట్లు ఇటీవల శ్రీ వెంకటేశ్వర బ్యానర్ వారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి ఒక విషయాన్ని తెలియజేశారు. మరో కొద్ది రోజులలో మూడు మిలియన్ల మార్పు వైపుగా వెళుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
మొత్తానికి ఈ సంక్రాంతికి విడుదలైన మూడు చిత్రాలలో సంక్రాంతి వస్తున్నాం సినిమా అందరిని ఆకట్టుకుంటోంది. వెంకటేష్ కెరియర్ లోని భారీ కలెక్షన్స్ రాబడుతున్న చిత్రంగా ఈ సినిమా నిలిచేలా కనిపిస్తోంది. మరి ఏ మేరకు ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. గతంలో కూడా ఎన్నో సందర్భాలలో సంక్రాంతికి వెంకటేష్ సినిమాలు విడుదలై మంచి విజయాలను కూడా అందుకున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బాస్టర్ విజయాలని అందుకున్నాయి. అందుకే ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి చాలామంది హీరో, హీరోయిన్స్ సైతం మక్కువ చూపుతూ ఉన్నారు. మరి తదుపరి చిత్రన్ని అటు వెంకటేష్ ఇటు డైరెక్టర్ ఎవరిదో తీస్తారో చూడాలి.