ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది. కరోనాకి ముందు కరోనాకి తర్వాత అన్న రేంజ్ లో అందరి హెల్త్ లు మారిపోయాయి . మరీ ముఖ్యంగా ఒకప్పటిలా జనాలు ఇప్పుడు ఏది పడితే అది తినడం లేదు . ఒకప్పుడు యువత కానీ పెద్దవాళ్ళు కానీ నోటికి ఏది రుచికరంగా అనిపిస్తే అది ఎక్కువగా లాగించేసేవాళ్ళు. ఆయిల్ పదార్థాలు, మసాలా పదార్థాలు..స్వీట్స్.. ఎక్కువగా తీసుకునే దానికి ఇంట్రెస్ట్ చూపించేవారు.  కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది . కరోనా తర్వాత ఎప్పుడు ఎలాంటి వైరస్ వస్తుందో ..? ఎలాంటి వైరస్లను ఎదుర్కోవాలో..? అన్న భయం కారణంగా ముందు నుంచే హెల్త్ పట్ల కాన్షియస్ గా ఉంటూ రకరకాల డైటింగ్ లు చేస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్లు లేదా నిమ్మకాయ నీళ్లు.. లేదంటే రాగి జావా ఎక్కువగా మొలకెత్తిన గింజలు.. కార్బోహైడ్రేట్స్ పక్కన పెట్టి దానికి ఆల్టర్నేట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు .


ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ డైట్ కి సంబంధించిన విషయం కూడా బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు బాగా తినేసేవాడు . ఏది కావాలంటే అది తినేసేవాడు.  దాదాపు 100 కేజీలకు పైగానే బరువు పెరిగిపోయాడు . ఆ తర్వాత రాజమౌళి అన్న మాటకి ఆయన బరువు తగ్గాడు . దాదాపు 35 కిలోల బరువు తగ్గాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ఫాలో అవుతున్న డైట్ అందరికీ బాగా నచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేస్తాడట.  అంతేకాదు వెంటనే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగుతారట.



ఆ తర్వాత నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటారట.  ఆ తర్వాత యోగ కూడా చేస్తారట . దాదాపు రెండు గంటలకు పైగానే యోగా చేస్తారట . ఆ తర్వాత ఉడకబెట్టిన గుడ్లను రాగిజావను టిఫిన్  గా తీసుకుంటారట . మధ్యాహ్నం లంచ్ లోకి రాగిసంగటి - నాటుకోడి.. రాత్రి డిన్నర్ లోకి స్ప్రౌట్స్ ఇలాంటివి ఫాలో అవుతారట . మధ్యలో ఎప్పుడైనా ఆకలి వేస్తే  జూసెస్..నట్స్ తీసుకుంటారు తప్పిస్తే ఆయిల్ పదార్థాలను అసలు తాకనే తాకరట.  అయితే గతంలో సీనియర్ ఎన్టీ రామారావు గారు కూడా ఇలాగే చేసేవారు . మొదట ఆయన ఫుడ్ ని బాగా లాగించేశారు . 15 మిరపకాయ బజ్జీలు.. కేజీ చికెన్ ఒక పూట కే కుమ్మేసేవారు.  అయితే ఆ తర్వాత ఆయన క్రమక్రమంగా హెల్త్ డైట్ ఫాలో అవుతూ వచ్చారు. కడుపునిండా తింటారు కానీ హెల్తీ ఫుడ్ ని  తింటూ వచ్చారు". ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే చేస్తున్నాడు . మొదట ఫుల్ గా తినేసాడు ఇప్పుడు హెల్త్ డైట్ అంటూ ఫాలో అవుతున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: