డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పటాస్ సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా అడుగుపెట్టారు. ఈ సినిమాతో తన కామెడీ టైమింగ్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సుప్రీమ్, రాజా ది గ్రేట్, F1, F2, సరిలేరు నీకెవ్వరు, భగవాన్ కేసరి వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించారు. తన సత్తా ఎంటో చూపించారు. ఈ సినిమాలు హిట్ కావడంతో నిర్మాతలకు కూడా కాసుల వర్షం కురిసింది. ఇక తాజాగా సంక్రాంతి వస్తున్నాం అని సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు అనిల్ రావిపూడి.సంక్రాంతి వస్తున్నాం సినిమా కు ఎవరు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తుంది. వెంకటేష్ యాక్టింగ్ కు, అనిల్ టేకింగ్ కు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా నాలుగు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 132 కోట్లు వసూలు చేసి, సంక్రాంతి హిట్ గా నిలిచింది. అదే తరుణంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ వహించిన ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంతు కేసరి లు వరుసగా యుఎస్ లో మిలియన్ డాలర్లతోపాటు 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు నిలిచిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో తాజాగా సంక్రాంతికి వస్తున్నాం కూడా చేరిపోయింది.ఇదిలావుండగా వరుస విజయాలతో కట్టబెడుతూ ప్రేక్షకులు చాలా ఇచ్చారని, ప్రతిఫలంగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే తన లక్ష్యమని డైరెక్టర్ అనిలరావిపూడి అన్నారు ఆడియన్స్ ఖర్చుపెట్టే ప్రతి పైసాకు న్యాయం చేస్తానన్నారు.థియేటర్ లకు వచ్చే జనం, కలెక్షన్లనే సక్సెస్ గా మాట్లాడుకుంటున్నామని చెప్పారు. క్రిటిక్స్ ఎప్పుడు ఉంటారని, వారి మాటలతో ఒత్తిడికి లోనవ్వనని తెలిపారు. తనకు ప్రేక్షకుల అభిప్రాయమే ముఖ్యమని ఓ ఇంటర్వ్యూ లో వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: