నాగచైతన్య.. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు.  సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆమెను వాడుకొని వదిలేసాడు అని దారుణాతి దారుణంగా కామెంట్ చేశారు . అసలు హీరోగా ఎదగగలవా ..? నీకు అంత సీన్ ఉందా..? తాత పెద్ద స్టార్.. నాన్న ఇంకా పెద్ద స్టార్.. కానీ నువ్వు మాత్రం ఒక హీరోగా కూడా ఎదగలేకపోతున్నావు..హిట్ కూడా కొట్టలేకపోతున్నావు అంటూ ఘటు ఘాటుగా ట్రోల్ చేశారు . సీన్ కట్ చేస్తే నాగచైతన్య ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేసే రేంజ్ కి వెళ్ళిపోయాడు.
 

ఒకపక్క సినిమాలతో మరొక పక్క పర్సనల్ లైఫ్ రెండిటిలోనే జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు . రీసెంట్ గానే నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ప్రెసెంట్ హనీమూన్ లో బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ జంట. మరొక పక్కన నాగ చైతన్య "తండేల్" సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడానికి రెడీగా ఉన్నాడు . అయితే ఇప్పుడు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల హనీమూన్ కి సంబంధించిన కొన్ని పిక్స్ బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి .



అయితే హనీమూన్ లో భర్త - భార్య మాత్రమే ఉంటారు.  మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు . ఇక్కడ మాత్రం నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ప్రైవేట్ ఫోటోల్లో వేరే ఒక అమ్మాయి కూడా ఉంది . ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో అంటూ తెగ చర్చలు మొదలుపెట్టేశారు జనాలు . హనీమూన్ కి వీళ్లిద్దరే వెళ్లారు కదా ..? మధ్యలో ఈ అమ్మాయి ఎవరు ..? వాళ్లతో ఎందుకు ఫోటో దిగింది ..? శోభిత ధూళిపాళ్లకి అంత క్లోజ్ గా ఉన్న ఈ అమ్మాయి ఎవరు ..??ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . అయితే ఈ అమ్మాయి ఎవరు అనేది తెలియకపోవడంతో.." ఎవరు ఈ మిస్టరీ గర్ల్..? అక్కినేని ఫ్యామిలీలో ఏం జరగబోతుంది..?" అంటూ రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: