అయితే కీర్తి సురేష్ మాత్రం అవిపెద్దగా పట్టించుకోలేదు . రీసెంట్గా కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది . అందులో తన భర్తకు సంబంధించిన విషయాలను ఓపెన్ గా చెప్పుకొచ్చింది . "చాలామంది అంటూ ఉంటారు పెళ్లి తర్వాత మార్పులు వస్తాయి అని .. కానీ నాకు అలా ఏమీ మారలేదు .. నేను పెళ్ళికి ముందు ఎలా ఉన్నానో పెళ్లి తర్వాత కూడా అలానే ఉన్నాను . అయితే నా భర్త ఆంటోని మాత్రం ఒక విషయంలో ఇబ్బంది పడుతున్నాడు . నేను ఎక్కడికి వెళ్ళినా సరే కెమెరా మ్యాన్స్ కిల్క్ అంటూ ఫోటోస్ తీయడానికి వచ్చేస్తారు"..
"ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అది నాకు అలవాటే . కానీ ఇప్పుడు నా పక్కన నా భర్త కూడా ఉన్నాడు . అదే అంటోనీకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆయనకి ఫొటోస్ అలాంటివి పెద్దగా నచ్చవు కానీ నా కోసం సైలెంట్ గా ఉన్నాడు . ఒకవేళ ఫొటోస్ వద్దు అని ఏదైనా మాట్లాడితే అది పెద్ద రాద్ధాంతం జరిగిపోతుంది ఏమో .. అందుకే నాకోసం అన్ని భరిస్తున్నాడు. తనకి ఫోటోలు తీసుకోవడం ఇష్టం లేకపోయినా.. నాకోసం తప్పదు అన్నట్టు భరిస్తున్నాడు . నా భర్త చాలా మంచివాడు " అంటూ పరోక్షకంగానే అంటోని తట్టిల్ ను బాగా ప్రశంసలతో ముంచేశారు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. కీర్తి సురేష్ ఫ్యాన్స్ యు ఆర్ సో లక్కీ అంటూ పొగిడేస్తున్నారు..!