నమ్రత శిరోద్కర్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. నమ్రత తన వివాహానికి ముందు కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. తనదైన నటన, అందంతో అభిమానులను ఆకట్టుకుంది. 1977లో శత్రుజ్ఞ సిన్హా దర్శకత్వం వహించిన షిరిడి కె సాయిబాబా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. అనంతరం 1998లో జబ్ ప్యార్ కిసీసే సే హోతా హై అనే బాలీవుడ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. 


అనంతరం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన అంజి సినిమాలో హీరోయిన్ గా చేసింది. మహేష్ బాబుతో 2000లో వంశీ సినిమాలో నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. అనంతరం వీరిద్దరూ వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. వివాహం తర్వాత నమ్రత సినిమాలను పూర్తిగా మానేసింది. తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించింది. ఇదిలా ఉండగా.... నమ్రతా శిరోద్కర్, శిల్పా శిరోద్కర్ మధ్య ఏవో కొన్ని గొడవలు ఉన్నాయన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.


అయితే ఈ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చింది. రీసెంట్ గా శిల్పా శిరోద్కర్ నమ్రతను కలిసింది. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ మీరిద్దరూ ట్విన్స్ లాగా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. జనవరి 22వ తేదీన నమ్రత పుట్టినరోజు సందర్భంగా శిల్ప ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసుకుంది. హ్యాపీ బర్త్డే.... ఐ లవ్ యు సో మచ్... నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో అసలు నువ్వు ఊహించలేవు.


నువ్వు ఎప్పటికీ నాకు సొంతమే అంటూ నమ్రత పుట్టినరోజున శిల్ప శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా.... మహేష్ బాబు, నమ్రతలు శిల్పా శిరోద్కర్ కు సపోర్ట్ గా లేరంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. శిల్పాను పట్టించుకోవడం లేదంటూ వచ్చిన రూమర్లపై ఈ పోస్టుతో చెక్ పడినట్లు అయింది. వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని అర్థమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: