పెద్ద అయ్యాక నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అంటూ చిన్న పిల్లలను అడిగితే ..నేను హీరోయిన్ సమంత లా అవుతాను అని .. ఎవరి సపోర్ట్ తీసుకోకుండా నా కాళ్లపై నేనే నిల్చుని స్ట్రాంగ్ ఉమెన్ గా మారుతాను "అంటూ చిన్న చిన్న పిల్లలు కూడా ముద్దు ముద్దుగా చెప్పడం చాలా చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది . అందరికీ సమంత అంత రోల్ మోడల్ గా నిలిచింది . అలాంటి సమంత ఇప్పుడు ఎలాంటి సిచువేషన్ లో ఉందో అందరికీ తెలుసు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత టోటల్ కెరియర్ మారిపోయింది .
అఫ్ కోర్స్ హ్యూజ్ ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటుంది. అయితే అవి పెద్దగా పట్టించుకోవట్లేదు ఈ అందాల ముద్దుగుమ్మ. రీసెంట్గా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. "నేను రెండేళ్ల నుండి డైరీ రాయడం ప్రారంభించాను ..నాకు ఇష్టమైనది ఇష్టం లేనిది ..మనసు కుభర్టింగ్గా అనిపించింది.. బాగా ఎంజాయ్ చేస్తున్నా మూమెంట్స్.. అన్నీ కూడా డైరీలో రాసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ లో ఏం రాయాలో కూడా నాకు తెలియలేదు . మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నాను. చాలా చాలా మనసుకు హాయిగా ఉంది . నాకు ఇది ఒక గేమ్ ఛేంజర్ లా మారిపోయింది . మీరు ట్రై చేయండి . కచ్చితంగా మీ లైఫ్ లోను మార్పులు వస్తాయి "అంటూ రాసుకు వచ్చింది". అయితే దీనిపై సమంత ఫ్యాన్స్ పాజిటివ్గా స్పందిస్తుంటే ..మరి కొంతమంది మాత్రం నెగిటివ్ గా కౌంటర్స్ వేస్తున్నారు . అంటే నీ డైరీ ఓపెన్ చేస్తే నీకు సంబంధించిన విషయాలు అన్నీ బయటపడిపోతాయి.. నీ ప్లస్ లు.. మైనస్ లు అంటూ వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు..!