గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోతుంది. అయితే ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజు రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు.కానీ అందులో వాస్తవం లేదని తేలిపోయింది. ఇదిలావుండగా టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అందరికంటే భిన్నంగా పోస్టులు చేస్తూ సంచలనం సృష్టిస్తుంటారు. తనకు ఏది అనిపిస్తే అది చెప్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఆయన సినిమాలు తెరకెక్కించిన దానికంటే సోషల్ మీడియాలోని పోస్టుల వల్లే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం శారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా, రామ్ గోపాల్ వర్మ సంచలన ఇంటర్వ్యూ తో వార్తల్లో నిలిచాడు.ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్‌ గోపాల్‌ వర్మ మాట్లాడుతూ, గేమ్‌ ఛేంజర్‌ ఫెయిల్యూర్‌కి అసలు కారణం ఏంటో తెలిపారు.

ఓ లాజికల్‌ పాయింట్‌ ని ఆయన చర్చించారు. శంకర్‌ రూపొందించిన సినిమాల్లో ఏదో ఒక బలమైన పాయింట్‌ ఉంటుంది. వాటి చుట్టూ కథ నడిపిస్తాడు. ఒకే ఒక్కడు లో ఒక్క రోజు సీఎం అవ్వడమనే పాయింట్‌ అప్పట్లో చాలా క్రేజీగా ఉండేది. ఆడియెన్స్ కి సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌గా ఉంది. అందుకే అది ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యిందని,అలాగే రోబో సినిమాలో రోబో అనేది కొత్త పాయింట్‌. పైగా అందులోనూ రోబోకి లవ్‌ పుడితే ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌. దాని కోసం జనం ఎగబడి చూశారు. కానీ గేమ్‌ ఛేంజర్ లో అలాంటి పాయింట్‌ లేదు. శంకర్ బలమైన సీడ్‌ వేయలేదు. బలమైన పునాది లేకపోతే ఏదైనా ఎప్పుడు కూలుతుందో అర్థం కాదు,గేమ్‌ ఛేంజర్‌ విషయంలో కూడా అదే జరిగింది. బలమైన సీడ్‌ ని వేయడంలో విఫలమయ్యారు. ఇందులో చెప్పాలనుకున్న పాయింట్‌ ఏంటనేది క్లారిటీ లేదు. అదే బిగ్‌ మైనస్‌ అన్నారు రామ్‌ గోపాల్‌ వర్మ. ప్రస్తుతం ఆయన కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: