ఇటీవలే తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు, వారి బంధువుల కుటుంబ సభ్యుల పైన ఐటీ దాడులు గడచిన మూడు రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. అయితే దీంతో కొంతమంది నిర్మాతల వద్ద కొన్ని పత్రాలు లభ్యమయ్యాయి అంటూ పలు రకాల చానల్స్ లో సోషల్ మీడియాలో కూడా అసత్య ప్రచారాలు జరుగుతూ ఉండడంతో TFDC చైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఈ విషయం పైన స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద కేవలం రూ 20 లక్షల రూపాయల లోపు మాత్రమే ఉన్నాయని ఈరోజు మీడియా అంశం పైన మాట్లాడారు.


తమ వద్ద కూడా అంతా చాలా క్లీన్ గానే ఉందని అధికారులు కూడా చూసి ఆశ్చర్యపోయారని వెల్లడించారు. గత నాలుగు రోజులుగా తమ నివాసాలు ఆఫీసులలో ఐటి అధికారులు నిర్వహించినటువంటి సోదరులు తాము ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేదని..24 క్రాఫ్ట్ లో లావాదేవుల డీటెయిల్స్ ని సైతం తీసుకున్నారని తెలియజేశారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ కారణంగా తన తల్లిని ఆసుపత్రిలో చేర్పించామని అందుకోసం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అంటు తెలిపారు దిల్ రాజ్


దయచేసి ఎవరూ కూడా తప్పుడు వార్తలు పోస్టు చేయవద్దండి అంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది. తానేమి ఎవరికి టార్గెట్ అవ్వలేదని తనమీద సెర్చ్ జరిగి ఇప్పటికి 18 ఏళ్లు అయ్యింది. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అంటూ తెలిపారు దిల్ రాజ్. ఇండస్ట్రీలో అంతా కూడా ఆన్లైన్ బుకింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతోందని వెల్లడించారు. ఇండస్ట్రీ అంతటా కూడా ప్రస్తుతం రైడ్స్ జరుగుతున్నాయని కలెక్షన్ ఎక్కువ చూపించడం మీదే ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడుకోవాలని అలా చూపించడం తప్పు అని.. తీరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు దిల్ రాజ్. అలాగే ఫిబ్రవరి మూడవ తారీకున ఐటీ అధికారులు కలవమన్నారు అంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: