దేశవ్యాప్తంగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఈయనపై కత్తి దాడి జరిగినప్పటి నుండి ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. ముఖ్యంగా నిందితుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చాడని, డబ్బు కోసమే ఇంటికి దొంగతనానికి వెళ్లడాని కొంతమంది అంటే,మరి కొంతమంది ఏమో దీని వెనక అనుమానించాల్సింది ఉంది అని కామెంట్లు చేశారు.ఏది ఏమైనప్పటికీ పోలీసులు ప్రతి ఒక్క విషయాన్ని బయటపెడతారు. అది కూడా పెద్ద సెలబ్రిటీ కావడంతో కచ్చితంగా ఈ కేసులో జరిగిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సిందే. అయితే సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన కత్తి దాడి పై కరీనాకపూర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట పోలీసులు.. అయితే రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పని చేసే పనిమనిషి,కత్తి దాడి జరిగినప్పుడు ఇంట్లో ఉన్న ఎలిమియా ఫిలిప్ సంచలన విషయాలు బయట పెట్టింది. మొదట దాడికి వచ్చిన సమయంలో ఆ నిందితుడిని మేము అందరం పట్టుకొని ఒక రూమ్ లో బంధించాము. 

కానీ ఆ రూమ్ లాక్ ఎవరు తెరిచారో తెలియదు. ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయడం వల్లే నిందితుడు బయటికి వచ్చి సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేశారు అని చెప్పుకొచ్చింది. అయితే అందరూ కలిసి దొంగను పట్టుకొని రూమ్లో వేసి లాక్ వేశాకా లాక్ తీసింది ఎవరు అనే అనుమానాలు పోలీసుల్లో కలిగాయి. ఇక పోలీసులకు చిన్న క్లూ దొరికినా కూడా దాన్ని మొత్తం కూపి లాగి బయట పెట్టేస్తారు. ఇక ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నేటిజన్స్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కరీనాకపూర్ ని కూడా అనుమానించాల్సి ఉందని,ఆమెనే ఈ కుట్ర చేసింది కావచ్చు అంటూ ప్రచారం చేయడంతో ప్రస్తుతం ఈ వార్త బీటౌన్ లో  కలకలం రేపింది.దీంతో పోలీసులు కూడా కరీనాకపూర్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే పోలీసులు రికార్డు చేసిన స్టేట్మెంట్లో ఇద్దరు మాట్లాడిన మాటలు భిన్న కోణాల్లో ఉండడంతో కొన్ని అనుమానాలకు దారితీస్తోంది.

ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి జరిగిన సమయంలో కరీనాకపూర్ ఇంట్లోనే ఉంది.అలాగే దొంగతనానికి వచ్చిన వ్యక్తి నగలేవి ముట్టలేదని,కేవలం సైఫ్ పైనే అటాక్ చేసాడని చెప్పింది.కానీ సైఫ్ పై కత్తి దాడి జరిగి రక్తం కారుతూ నడవలేని స్థితిలో ఉన్న సమయంలో కరీనాకపూర్ భర్తని హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఇంట్లో ఏం చేసింది.. సైఫ్ ని కొడుకులు ఆటోలో తీసుకు వెళ్లడానికి కారణం ఏంటి..అంత పెద్ద హీరో ఇంట్లో కార్లు ఎందుకు ఆ టైంలో అవైలబుల్ లో లేవు..ఆటోలో ఎందుకు సైఫ్ ని తీసుకెళ్లాల్సి వచ్చింది.. అసలు రూమ్ లో వేసి లాక్ చేసిన నిందితుడు బయటికి ఎలా వచ్చారు.. డోర్ ఎవరు ఓపెన్ చేశారు   అంటూ ఇలా అనేక కోణాల్లో పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది..ఏది ఏమైనప్పటికీ సైఫ్ పై దాడి కేసులో పూర్తి సమాచారాన్ని బయటపెట్టేవరకు పోలీసులు నిద్రపోరు.

మరింత సమాచారం తెలుసుకోండి: