మొత్తానికి "అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని" అన్నట్టుగా ప్రశాంత్ వర్మ పరిస్థితి ఉంది. నిజానికి ప్రశాంత్ కి మంచి ప్రతిభ ఉంది. దానికి తోడు కెరీర్ ప్రారంభంలోనే హనుమాన్ వంటి పాన్ ఇండియా సక్సెస్ అందుకోవడం మామూలు విషయం కాదు. కానీ ఆ తర్వాత ప్రశాంత్ వేస్తున్న అడుగులు గందరగోళంగా ఉన్నాయి. హనుమాన్ తర్వాత బ్రహ్మ రాక్షస, మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లేదా జై హనుమాన్ వీటిలో ఏది వెంటనే మొదలైనా బాగుండేది. కానీ కొన్ని ప్రాజెక్ట్ లు ఆగిపోతున్నాయి, మరికొన్ని ఎప్పుడో మొదలవుతాయో తెలియట్లేదు.సాధారణంగా కొందరు సక్సెస్ తలకెక్కి, వచ్చిన మంచి అవకాశాలను చేజార్చుకుంటూ ఉంటారు. మరికొందరు ఒక భారీ సక్సెస్ తర్వాత, ఎలాంటి ప్రాజెక్ట్ ముందు మొదలుపెట్టాలో తెలియక తికమక పడుతుంటారు. మరి వీటిలో ప్రశాంత్ వర్మను వెనక్కి లాగుతున్న అంశమేంటో తెలియాలి.