నటుడు హరీష్ ఉత్తమన్ సౌత్ ఇండియా మూవీ లవర్స్‌కి చాలా సుపరిచితుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇలా భాష ఏదైనా విలన్‌గా మాత్రం అదరగొట్టేస్తాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. 2010లో తమిళ్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన హరీష్.. అతి తక్కువ టైంలోనే సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిపోయాడు. తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో విలనిజానికి కొత్త డెఫినిషన్ ఇచ్చాడు.

పవర్, గౌరవం, శ్రీమంతుడు, దువ్వాడ జగన్నాథం, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, ఎక్స్‌ప్రెస్ రాజా, జై లవ కుశ, అశ్వద్ధామ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, కంగువా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. హరీష్ నటించిన ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ప్రతి సినిమాలో విలన్‌గా తనదైన మార్క్ చూపించాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ 'OG'లో కూడా హరీష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు.. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయి.

హరీష్ పర్సనల్ లైఫ్ కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. 2018లో అమృత కళ్యాణ్‌పూర్‌ అనే మేకప్ ఆర్టిస్ట్‌ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏమైందో ఏమో, పెళ్లైన ఏడాదికే ఇద్దరూ విడిపోయారు. అభిప్రాయ భేదాలే కారణమని అప్పట్లో టాక్ నడిచింది


2022 జనవరిలో హరీష్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈసారి చేసుకున్నది మలయాళ బ్యూటీ చిన్నూ కురువిలాని. 'నార్త్ 24 కాథం', 'కసబా', 'లుక్కా చుప్పి' లాంటి మలయాళ సినిమాలతో చిన్నూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా హరీష్, చిన్నూ పెళ్లి రోజు గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పెషల్ వీడియో కూడా పోస్ట్ చేశాడు హరీష్.

సినిమాలో విలన్‌గా ఎంత భయపెట్టినా హరీష్ మాత్రం ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు. తన డెడికేషన్, వెర్సటాలిటీతో అందరి మనసులు గెలుచుకున్నాడు. అందుకేనేమో, రోజురోజుకీ హరీష్ క్రేజ్ పెరుగుతోంది. ఇంకా చాలా ప్రాజెక్ట్స్‌తో హరీష్ సౌత్ ఇండస్ట్రీలో తన మార్క్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: