డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్‌గా విక్టరీ వెంకటేష్ తో తీసిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా సూపర్ హిట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి పోటెత్తారు. దీంతో అనిల్ రావిపూడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది  ఇప్పుడు అందరి కళ్లు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీదే ఉన్నాయి. అది మరెవరితోనో కాదు.. మెగాస్టార్ చిరంజీవితో. అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాని చిరుతో ప్లాన్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఇటీవల, ఇది కూడా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ మూవీ "లైలా" ప్రమోషన్స్ లో నిర్మాత సాహు గారపాటి ఈ చిరు-అనిల్ సినిమా గురించి అదిరిపోయే కామెంట్స్ చేశారు. "ఇది బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. అనిల్ రావిపూడి కెరీర్ లో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం" అని ఆయన ధీమాగా చెప్పారు. అంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు.

ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో సాహు గారపాటి ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ కూడా దండిగా ఉండే సినిమా అని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిపారు. స్క్రిప్ట్ పూర్తవగానే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందట. అంతేకాదు, ఈ సినిమాని సంక్రాంతి 2026కి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.

అనిల్ రావిపూడి టాలీవుడ్ లో టాప్ కమర్షియల్ డైరెక్టర్లలో ఒకరు. ఆయన "పటాస్" సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశాడు. తర్వాత మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్స్ కొట్టాడు. చిరు, అనిల్ కాంబినేషన్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు కుదిరింది. "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా సక్సెస్ అయ్యాక చిరంజీవి ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అనిల్ రావిపూడి ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో వర్క్ చేశారు. వాళ్ళని ఫ్యామిలీ, మాస్ రోల్స్ లో ఎలా ప్రెజెంట్ చేయాలో అనిల్ కి బాగా తెలుసు.

చిరంజీవి అన్ని రకాల పాత్రలు చేయగల ఆల్‌రౌండర్.. అనిల్ స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్‌కి చిరంజీవి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారు. చిరు కామెడీ టైమింగ్, ఆయన స్టార్ ఇమేజ్ ని అనిల్ బాగా వాడుకుంటారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: