పటాస్, రాజా ది గ్రేట్, సుప్రీమ్, ఆగడు, ఎఫ్2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో మరింత క్రేజ్ దక్కించుకున్నాడు. రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించిన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
చాలా నేచురల్ కథతో అనిల్ రావిపూడి ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. భారీగా కలెక్షన్లను సైతం రాబడుతోంది. అయితే ఈ సినిమాతో అనిల్ రావిపూడి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. కాగా, ఈ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి మరో సినిమాను చేసే పనిలో పడ్డారట.
ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి కథను కూడా రెడీ చేసుకున్నారట. ఆ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవిని ఫైనల్ చేశారట. చిరంజీవితో ఆ సినిమా చాలా బాగుంటుందని అనుకుంటున్నారట. తాను రాసుకున్న కథకి మెగాస్టార్ చిరంజీవి హీరో అయితే సినిమా చాలా బాగుంటుందని అనిల్ రావిపూడి భావిస్తున్నారట. దీంతో తన తదుపరి సినిమాను మెగా హీరో చిరంజీవితో చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.