బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్ కి, బుల్లితెర బ్యూటీ కావ్య శ్రీ లవ్ ట్రాక్ గురించి తెలియని వారుండారు. వారిద్దరికీ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకి నిఖిల్ హాజరయ్యాడు. ఆ ఇంటర్వ్యూ హోస్ట్ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడైనా నువ్వు కావ్యని మిస్ అయ్యవ అని నిఖిల్ ని అడిగాడు. దానికి నిఖిల్ ఆ ప్రశ్న అడగకు అని వెంటనే పక్కనే పెట్టేశాడు. ఇక ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  
ఇక ఇంతకుముందు నిఖిల్ హీరోగా నటించిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ రోల్ లో కావ్య శ్రీ నటించింది. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయిందని సమాచారం. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక బయట నాకు వేరే ఉన్నారని.. బ్రేకప్ అయిందని నిఖిల్ అన్నాడు. బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత తనని కలుస్తానని, తనపై ఉన్న ప్రేమని మళ్లీ వ్యక్తపరుస్తానని ఎమోషనల్ అయ్యాడు. కానీ నిఖిల్ హౌస్ నుండి బయటికి వచ్చి రోజులు గడిచాయి కానీ తాను కావ్య శ్రీ కలవడానికి వెళ్లలేదు. ఇక వీరిద్దరూ మళ్లీ ఇద్దరు కలుస్తారని..  ఫాన్స్ ఆశిస్తున్నారు.  
ఇకపోతే స్టార్ మా లో ప్రసారం అయ్యే గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిఖిల్.. అందరి మనసు దోచుకున్నాడు. ఆయన నటనతో తెలుగు వారిని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు. అంతేకాదు నిఖిల్ స్టార్ మాలో ప్రసారమయ్యే ప్రతి షోలో పాల్గొనేవాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఆఫర్ రావడంతో మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. తన మాట, ఆటతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు. నిఖిల్ కి మాత్రమే సీజన్ 8 విన్నర్ అయ్యే అర్హత ఉందని ప్రేక్షకుల అందరి నోట అనిపించుకున్నాడు. ఈ సీజన్ లో 22 మంది దాటుకొని 105 రోజులు బిగ్ బాస్ హౌస్ లో జర్నీ చేసి గెలిచాడు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారుని కూడా బహుమతిగా పొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: