ఇక ఇటీవల రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు ఇచ్చింది. వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ కు రూ. 2.15 కోట్లు ఒప్పందం చేసుకున్నారని తెలిపింది. కానీ రూ. 1.15 కోట్లు మాత్రమే చెల్లించారని నోటీసులు పంపింది. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలని రామ్ గోపాల్ వర్మతో గతంలో ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టం చేసింది.
అయితే ఈ సినిమాకు కేవలం 1863 వ్యూస్ మాత్రమే ఉన్నాయని ఒక్కో వ్యూకు రూ. 11 వేలు చొప్పున చెల్లించారని తెలిపింది. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి కోటీ 15 లక్షల వరకూ అనుచిత లబ్ధి పొందారని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఫైర్ అయ్యింది. దీనిపై వివరణ కోరుతూ వ్యూహం సినిమాకు లీగల్ నోటీస్ ఇచ్చినట్లు తెలిపింది. ఏపీ ఫైబర్ నెట్‌లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుపుతామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.