అయితే రష్మిక, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగంగా ఆమె మాట్లాడుతూ.. నేను నా కుటుంబాన్ని ఎంతగానో మిస్ అవుతున్నాను. కెరీర్ కోసం కుటుంబాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఇంకొకటి త్యాగం చేయక తప్పదు అని నాకు ఈ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడే మా అమ్మ చెప్పింది. నా ఫ్యామిలీ తో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. నాకు నా చెల్లి అంటే చాలా ఇష్టం. మేము ఇద్దరం రోజు మెసేజ్ చేసుకుంటాం' అని రష్మిక ఎమోషనల్ అయ్యింది.
ఇప్పటికే ఈ సినిమా టైలర్ రిలీజ్ వేడుక ముంబాయిలో జరిగింది. కాలికి గాయం అయినప్పటికీ ఆ ఈవెంట్ కి రష్మిక వచ్చింది. ఛావా సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని రష్మిక చెప్పుకొచ్చింది. ఒక నటిగా ఇంతకు మించి తనకి ఏం కావాలని.. ఈ సినిమా తర్వాత తాను సంతోషంగా రిటైర్ అయిపోతానని దర్శకుడితో ఒక సందర్భంలో తాను చెప్పినట్లు తెలిపింది. ఎందుకంటే ఈ సినిమాలో తనకు వచ్చిన పాత్ర అంత గొప్ప అని చెప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో సార్లు తాను ఎమోషనల్ అయినట్లు తెలిపింది. ట్రైలర్ చూశాక కూడా తనకి అదే ఫీల్ కలిగిందని ఆమె చెప్పుకొచ్చింది.