తెలుగులోనే కాదు సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరిలోనూ మలయాళ భామ సాయి పల్లవి సంథింగ్ స్పెషల్ అని చెప్పడంలో సందేహం లేదు. తను చేస్తున్న ప్రతి సినిమా సక్సెస్ అవ్వడమే కాకుండా ఆడియన్స్ లో తన క్రేజ్ సినిమా సినిమాకు పెంచుకుంటుంది. సాయి పల్లవి సినిమాలో ఉందా బ్లైండ్ గా సినిమా చూసేద్దాం అనుకునే ఫ్యాన్స్ ని సంపాదించింది. ఆమె సినిమాలో కచ్చితంగా కంటెంట్ ఉంటుందని గట్టి నమ్మకం.

అంతేకాదు సాయి పల్లవి సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయి. ఇక ఆమె డ్యాన్స్ మూమెంట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాయి పల్లవి లోని ఈ అడిషన్ టాలెంట్ ని డైరెక్టర్స్ పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు. ఐతే ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తున్న సాయి పల్లవి ఆ సినిమాలో కూడా తన మార్క్ నటనతో ఆకట్టుకోబోతుంది.

ఐతే ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ మూమెంట్స్ కూడా అదిరిపోతాయని తెలుస్తుంది. సినిమా నుంచి లేటెస్ట్ గా హైలెస్సో సాంగ్ రిలీజ్ అవగా దాని గురించి నిర్మాత బన్నీ వాసు చెబుతూ లిరికల్ వీడియో జస్ట్ శాంపిల్ మాత్రమే సినిమాలో పాట అదిరిపోతుందని.. సాయి పల్లవి నిమిషం పాటు వేసిన స్టెప్స్ ఆమె ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందిస్తుందని అన్నారు. సో అలా చెప్పడం వల్ల ఆ సాంగే కాదు తండేల్ సినిమా పై కూడా సూపర్ హై వచ్చింది. తప్పకుండా తండేల్ కి వస్తున్న బజ్ చూస్తుంటే ఫస్ట్ డే నే రికార్డ్ సృష్టించేలా ఉంది. ఆల్రెడీ లవ్ స్టోరీతో హిట్ అందుకున్న కాంబో మరో లవ్ స్టోరీ అది కూడా దేశభక్తిని చాటేలా ఉంది కాబట్టి సినిమా అక్కినేని ఫ్యాన్స్ కే కాదు సినీ లవర్స్ కి కూడా ఒక సెపరేట్ ట్రీట్ ఇస్తుందని అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: