సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా అభిమానులలో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతే కాకుండా అభిమానులకు సహాయం చేయడంలో కూడా ముందు ఉంటారు బాలయ్య. ఇలా ఆంధ్ర నుంచి కలల విభాగంలో బాలయ్యకు తాజాగా పద్మభూషణ్ అవార్డుని సైతం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 19 మందికి పద్మభూషణ్ అవార్డులు సైతం వారించాయి.. ఇందులో శేఖర్ కపూర్, గోస్వామి, అజిత్, శోభన, పంకజూ దాస్ తదితరులు ఉన్నారట. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడంతో అటు అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలతో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు కూడా బాలయ్య పైన ప్రశంసలు కురిపించారు.


అయితే తాజాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో అభినందనలు తెలియజేస్తూ పద్మభూషణ్ అవార్డు లభించినందుకు కంగ్రాజులేషన్స్ బాబాయ్.. సినీ పరిశ్రమకు గాను ప్రజాసేవకు గాను మీరు చేసిన అసమానమైన సేవలకు సైతం నిదర్శనంగానే ఈ గుర్తింపు లభించింది అంటూ ఎన్టీఆర్ తెలియజేశారు.. ఇలా మొత్తం మీద ఎన్టీఆర్ కంగ్రాజులేషన్స్ చెప్పడంతో అటు బాలయ్య అభిమానులు కూడా ఈ విషయం పైన కాస్త ఆనందం తెలియజేస్తున్నారు.


గత కొంతకాలంగా ఎన్టీఆర్, నందమూరి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయని విషయం పైన చాలామంది పలు రకాల రూమర్లు సృష్టించారు.. కానీ ఎన్నో సందర్భాలలో తమ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవనే విషయాలను కూడా తెలియజేసినట్లు కనిపిస్తోంది. మరి ఈ విషయం పైన ఎన్టీఆర్కు బాలయ్య ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి. ప్రస్తుతమైతే ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఏడాది బాలయ్య డాకు మహారాజు సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి మంచి విజయాన్ని అందుకున్నారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటున్న ఏకైక హీరో గానే బాలయ్య పేరు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: