- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట‌సింహం బాలకృష్ణ సినిమాలలోకి వచ్చి తాజాగా 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. మామూలుగా బాలయ్య అంటే హీరో అనుకుంటాం . . బాలయ్య సినిమా హీరోగా మాత్రమే అందరికీ తెలుసు. బాలయ్యలో చాలా అంశాల్లో అద్భుతమైన ప్రతిభ దాగివుంది. బాలయ్యలో ఒక దర్శకుడు ఉన్నాడు. ఒక ఫైట్ మాస్టర్ ఉన్నాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. ఒక సినిమాటోగ్రాఫర్ ఉన్నాడు. ఒక రచయిత కూడా ఉన్నాడు. ఇక రాజకీయంగా బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.


తన తండ్రి దివంగత ఎన్టీఆర్, తన అన్న దివంగత హరికృష్ణ ప్రాతినిథ్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. బాలయ్య నర్తనశాలతో పాటు.. తాను నటించిన కొన్ని సినిమాలలో సీన్లకు, యాక్షన్ సీన్లకు కూడా దర్శకత్వం వహించడం విశేషం. ఇదిలా ఉంటే బాలయ్యలో మంచి రచయిత కూడా ఉన్నారు. బాల‌య్య మ‌న‌సు లో ఏదైనా క‌థ అనుకున్నా .. దానిని బాగా డ‌వ‌ల‌ప్ చేస్తారు. అలాగే ఆయ‌న కొన్ని సినిమా ల‌లో తాను న‌టించిన సీన్ల‌కు మాట‌లు రాసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.


ఇక బాల‌య్య లో ర‌చ‌యిత విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఒక రాత్రి ఆయన తాను నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఆదిత్య 369 కు సీక్వెల్‌ చేయాలని ఆలోచించారు. తెల్లారేసరికి ఆదిత్య 999 కథ‌ సిద్ధం చేసేసారు. బాలయ్య నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమాల‌లో ఆదిత్య 369 సినిమా ఒకటి. ఈ సినిమాకు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఆదిత్య 999 సినిమాలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా నటిస్తాడంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: