- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


నందమూరి నట‌సింహ బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్‌ సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కింది. బాలయ్య 110 వ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2. ఈ సినిమా షూటింగ్ కూడా పట్టాలు ఎక్కిన సంగతి తెలిసిందే. బాలయ్య తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. కొందరు హీరోయిన్లతో రిపీటెడ్ గా సినిమాలు చేశారు. బాలయ్య తన కెరీర్లు ఎక్కువసార్లు కలిసిన న‌టించిన హీరోయిన్ విజయశాంతి.


బాలయ్య - విజయశాంతి కాంబినేషన్ అంటేనే అప్పట్లో ఒక క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా నిప్పు రవ్వ. బాలయ్య - విజయశాంతి వరుసగా సినిమాలు చేస్తూ ఉండడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడిచింది అన్న ప్రచారం కూడా అప్పట్లో ఇండస్ట్రీలో గట్టిగా ఉంది. ఆ తర్వాత బాలయ్య మరే హీరోయిన్ తో నటించిన ఇలాంటి రూమర్లు రాలేదు .. కానీ సిమ్రాన్ విషయంలో కూడా ఇలాంటి రూమర్లు పుట్టాయి.


బాలయ్య - సిమ్రాన్ కాంబినేషన్లో సమరసింహారెడ్డి - నరసింహనాయుడు - సీమ సింహం సినిమాలు వచ్చాయి. ఇందులో రెండు ఇండ‌స్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. ఆ టైంలో కూడా బాలయ్య - సిమ్రాన్ మధ్య సంథింగ్ సంథింగ్ నడిచింది అన్న పుకార్లు అయితే టాలీవుడ్ లో వినిపించాయి. ఇక ఇటీవల కాలంలో బాలయ్య సోనాల్ చౌహాన్ - రాధిక ఆప్టే - ప్రగ్యా జైస్వాల్ లాంటి హీరోయిన్లతో రిపీటెడ్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: