రెబల్ స్టార్ ప్రభాస్ రానా కాంబినేషన్లో వచ్చిన బాహుబలి పార్ట్ వన్,పార్ట్ టు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు వాడి సత్తా ఏంటో ప్రపంచ నలుమూలలా తెలిసి వచ్చింది. ఈ సినిమా ద్వారా ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీని గొప్పగా పొగిడారు.. అయితే అలాంటి బాహుబలి కాంబో మళ్లీ రిపీట్ అవ్వబోతుందట. అవును మీరు వినేది నిజమే. సినీ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..ప్రభాస్ రానా కలిసి మరో సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.. రాజమౌళి డైరెక్షన్ చేసిన బాహుబలి 1, బాహుబలి 2 లో ప్రభాస్ రానా నటించి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమాలో ఎవరికి ఎవరు తగ్గనట్లుగా ఇద్దరి ఇమేజ్ కి తగ్గట్లే చూపించారు జక్కన్న.అయితే తాజాగా వీరి కాంబోలో సినిమా తీయాలి అనుకుంటున్నారట ఒక్క సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. టాలీవుడ్ సినీ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ప్రశాంత్ వర్మ గతంలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తో ఓ సినిమా చేయాలనుకున్నట్టు వార్తలు వినిపించాయి.

అయితే రణవీర్ సింగ్సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ప్రశాంత్ వర్మ ప్రభాస్ మెయిన్ లీడ్ లో చేసే ఒక స్టోరీని రాసుకున్నారట. ఈ సినిమాకి ప్రభాస్ ఐతేనే కరెక్ట్ గా సెట్ అవుతారని అనుకున్నారట. అయితే ఇదే మూవీలో ప్రభాస్ కి విలన్ పాత్రలో రణవీర్ సింగ్ ని తీసుకుందామని అనుకున్నప్పటికీ అది కుదరకపోవడంతో ఆ హీరో ప్లేస్ లో ఇప్పుడు రానాని సెట్ చేద్దాం అనుకుంటున్నారట. ఎందుకంటే ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన బాహుబలి 1 బాహుబలి 2 సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టడంతో మళ్ళీ వీరి కాంబోలో సినిమా వస్తే  అతిపెద్ద హిట్ అవుతుంది అని ప్రశాంత్ వర్మ ఆలోచన చేస్తున్నారట.ఇక ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సినిమాలు చూసి ప్రేక్షకులకు పూనకాలు వచ్చాయి. మళ్లీ వీరి కాంబోలో సినిమా అంటే కచ్చితంగా ధియేటర్లలో పూనకాలు లోడింగ్ అనాల్సిందే అంటున్నారు ఈ విషయం తెలిసిన సినీ జనాలు.

మరి చూడాలి ప్రశాంత్ వర్మ ప్రభాస్ రానా కాంబోలో సినిమా తీసుకువస్తారా..లేక ప్రభాస్ సరసన మరో హీరోని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.అయితే ప్రభాస్ రానా ఇద్దరినీ ఒకే సినిమాలో చూపించాలంటే కచ్చితంగా ఎవరి ఇమేజ్ కు తగ్గట్టు వారికి సన్నివేశాలు పెట్టాల్సిందే. రాజమౌళి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఇద్దరి ఇమేజ్ ఎక్కడ తగ్గకుండా సినిమా తెరకెక్కించారు. కానీ రానా ప్రభాస్ కాంబోలో సినిమా వస్తే మాత్రం ప్రశాంత్ వర్మ అన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచించి తెరకెక్కించాలి అంటున్నారు ఫాన్స్.ఎందుకంటే ఎవరిని తక్కువ చూపించినా అభిమానులు  అస్సలు ఒప్పుకోరు.మరి చూడాలి ఈ క్రేజీ ప్రాజెక్టు ని ప్రశాంత్ వర్మ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: