తెలుగు సినీ ఇండస్ట్రీలో అవలీలలుగా ఎంత పెద్ద డైలాగ్ అయినా చెప్పే నటులలో బాలయ్య ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా బాలయ్య వేసి స్టెప్పులు కూడా అందరిని ఆశ్చర్యపరస్తు తనకంటూ ప్రత్యేకంగా వేస్తూ ఉంటారు.. ఒక డైరెక్టర్ ఒక హీరోని నమ్మి చేస్తే ఎలా ఉంటుందో అలా పాత్రలోకి ఒదిగిపోయి చేస్తూ ఉంటారు బాలయ్య.. ఫ్యాక్షన్ హిస్టారికల్ యాక్షన్ ఫాంటసీ ఇలా ఏ జోనర్ లోనైనా సరే బాలయ్య ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటారు.


పరిశ్రమకు కొత్త దారిని చూపెట్టడంలో ముందు ఉంటారు బాలయ్య. బసవతారకం క్యాసర్ ఆసుపత్రి చైర్మన్గా కూడా ఎంతోమందికి సహాయం చేస్తూ ఉన్నారు బాలయ్య. గత ఏడాది ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి 50 ఏళ్లు కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ పద్మభూషణ అవార్డు కూడా అందుకొని మరింత జోష్ పెంచుకున్నారు.


మొదటిసారి బాలయ్య తాతమ్మ కల అనే సినిమాతో హీరోగా మొదలుపెట్టారు.. ఆ తర్వాత సాహసమే జీవితం, మంగమ్మగారి మనవడు, భలే తమ్ముడు, పట్టాభిషేకం, కథానాయకుడు, ముద్దుల కృష్ణయ్య ,భలే దొంగ, ముద్దుల మామయ్య తదితర చిత్రాలలో నటించి తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. లారీ డ్రైవర్ సినిమా బాలయ్య కెరియర్ లోనే తిరుగులేని పేరు సంపాదించేలా చేసింది. ఇప్పటికీ కూడా సీనియర్ హీరోలలో ఎక్కువ సక్సెస్ రేటింగ్ ఉన్న హీరోగా పేరు సంపాదించారు. నటుడుగానే కాకుండా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.


అయితే బాలయ్య సక్సెస్ వెనుక ఆయన భార్య వసుంధర ఉందని ఎన్నోసార్లు తెలియజేశారు.. ముఖ్యంగా తన పిల్లలను క్రమశిక్షణలో పెంచడానికి తన వంతు కృషి చాలానే చేసిందని.. తన ఎలాంటి సమయంలో ఉన్నా సరే ధైర్యం చెబుతూ తన జీవితాన్ని ముందుకు నడిపించేలా చేస్తూ ఉంటుందని బాలయ్య ఎన్నో సందర్భాలలో తెలిపారు. కానీ తన భార్య వసుంధర మాత్రం ఎక్కడా కూడా ఎలాంటి విషయాలలో తల దూర్చాలని కూడా చెప్పవచ్చు.. బాలయ్య సక్సెస్ వెనక తన కూతుర్ల ప్రమేయం ఉందో లేదో కానీ తన భార్య వసుంధర ఉందని విషయాన్ని ఒకానొక సందర్భంలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: