మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ గా పేరుపొందిన షఫీ తీవ్రమైన తలనొప్పితో ఈనెల 16 వ తేదీన ఆసుపత్రి చేరారట. అయితే ఆ తర్వాత అంతర్గత రక్తస్రావం కావడంతో శాస్త్ర చికిత్స చేస్తూ ఉండగా మరణించినట్లు మలయాళ ఇండస్ట్రీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈయన గత కొంతకాలంగా క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. చికిత్స పొందుతూ నిన్నటి రోజున మధ్యాహ్నం 12:25 నిమిషాలకు తుది శ్వాస విడిచారట. ఈ రోజున సాయంత్రం నాలుగు గంటలకు కారుకప్పిల్లి జుమ  మసీదు వద్ద ఈ డైరెక్టర్ అంత్యక్రియలు జరగబోతున్నాయట.



డైరెక్టర్ షఫీ 1968లో జన్మించారు. ఇక ఈయన తండ్రి ఎంపీ హంజా, తల్లి నబీసా కు జన్మించారట.. ఇక ఈయన బంధువులలో ఒకరైన డైరెక్టర్ సిద్ధికి కూడా ఒకరట..మలయాళ సినీ పరిశ్రమల ప్రముఖ దర్శకుడుగా పేరుపొందిన ఈయన ఎన్నో చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారట. రాజా సేన 1995లో విడుదలైన గురించి సినిమాకి సహ దర్శకుడుగా పనిచేశారట. మొదటిసారి జయరామ్ ముఖేష్ తో కలిసి వన్ మ్యాన్ షో చిత్రానికి దర్శకత్వం వహించారట..ఆ తర్వాత కళ్యాణ రామన్, చాక్లెట్, మాయావి, తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన షఫీ ఎన్నో మంచి విజయాలను అందుకున్నారు. చివరిగా ఈయన ఆనందం పరమానందం అనే సినిమాని తెరకెక్కించారట. ఈ సినిమా 2022 లో విడుదలైనది.


మమ్ముట్టి, పృథ్వీరాజ్, జై సూర్య తదితర వంటి హీరోలతో కూడా షఫీ సినిమాలు తీసి మంచి విజయాలను అందుకున్నారట. షఫీ ఓకే ఏడాదిలో ఎన్నో చిత్రాలను కూడా విడుదల చేసేవారట. నటుడు మమ్ముట్టి సినీ కెరియర్ లోనే విభిన్నమైన పాత్రలను సైతం అందించిన డైరెక్టర్ గా షఫీ పేరు సంపాదించారు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు అనారోగ్య సమస్యతో మృతి చెందడంతో పలువురు అభిమానులు సినీ సెలెబ్రెటీల సైతం తీవ్ర దిగ్భ్రాంతి ఆయన మరణానికి శాంతి చేకూరాలని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: