తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపుని సంపాదించుకున్న యువ నటీమణుల్లో వైష్ణవి చైతన్య ఒకరు. ఈమె షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ను మొదలు పెట్టి వాటి ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలా కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈమె విజయ్ దేవరకొండ తమ్ముడు అయినటువంటి ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన బేబీ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ పై ప్రేక్షకులు పెద్ద స్థాయిలో అంచనాలు పెట్టుకోలేదు.

మామూలు అంచనాల నడుమ ఈ సినిమా విడుదల అయింది. ఇక పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ అద్భుతమైన కలక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో వైష్ణవి తన నటనతో , అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఈ సినిమాలో ఈ బ్యూటీ కొన్ని కొన్ని సన్నివేశాలలో ఈమె తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రదర్శనను ఇచ్చింది. ఈ మూవీ తో ఈమెకు అద్భుతమైన గుర్తింపు యూత్ ఆడియన్స్ లో వచ్చింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ లవ్ మీ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ ఈ మూవీ లో కూడా ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం కూడా వైష్ణవి చైతన్య వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా కెరియర్ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే ఈమె సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: