ఈ మధ్యకాలంలో సెలబ్రెటీల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ హీరోయిన్ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎవరిని పెళ్లి చేసుకోబోతుందయ్యా అనేది చూస్తే రూబా రూబా అనే పాటతో టాలీవుడ్ లో చాలా ఫేమస్ అయిన నటి షాజన్ పదంసీ.. రామ్ చరణ్ డిజాస్టర్ సినిమా ఆరెంజ్ రీ రిలీజ్ లో అతి పెద్ద సంచలన సృష్టించింది.అయితే ఈ మూవీ విడుదలైన సమయంలో డిజాస్టర్ అయ్యి రీ రిలీజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించడంతో ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది. అయితే ఆరెంజ్ మూవీని రామ్ చరణ్ పుట్టిన రోజు రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ ఏడాది వాలెంటైన్స్ డే కి కూడా ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ కాబోతోంది.దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది.ఈ విషయం పక్కన పెడితే తాజాగా..ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది. 

రూబా రూబా అనే పాటతో ఫేమస్ అయిన నటి షాజన్ పదంసి తాజాగా తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. షాజన్ పదంసి గత ఏడాది నవంబర్లో తన ప్రియుడు ఆశిష్ ప్రొపోజ్ చేసిన ఫొటోస్ ని నెట్టింట్లో షేర్ చేసింది. అయితే ఈ ఏడాది జనవరి 20న ఈ ముద్దుగుమ్మ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంటూ జనవరి 20న కొత్త ప్రయాణం స్టార్ట్ అయింది అంటూ క్యాప్షన్ పెట్టింది షాజన్.. దీంతో షాజన్ పదంసి ఎంగేజ్మెంట్ చేసుకుంది అని అందరికీ అర్థమైంది. ఇక పెళ్లి డేట్ ని ప్రకటించకపోయినప్పటికీ పెళ్లి కూడా ఇదే ఏడాది ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

 ఇక ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ సరసన జెనీలియా, షాజన్ పదంసి నటించింది. ఇక జెనిలియా అందరికీ తెలిసిన హీరోయిన్ అయినప్పటికీ ఈ సినిమా ద్వారా షాజన్ పదంసీ కి కూడా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.ఒకే ఒక్క పాటతో అప్పటి యూత్ ని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక షాజన్ ఆరెంజ్ మూవీ కంటే ముందే హిందీ, తమిళ భాషల్లో కూడా నటించింది.ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించిన హీరోయిన్ తెలుగులో ఆరెంజ్ తో పాటు మసాలా మూవీ లో కూడా నటించింది. వెంకటేష్ రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన మసాలా సినిమాలో రామ్ పోతినేనికి జోడిగా షాజన్ పదంసి నటించింది.ఇక వెంకటేష్ కి జోడిగా నటి అంజలి చేసింది.అలా రెండు తెలుగు సినిమాల్లో నటించడంతో షాజన్ పదంసికి  తెలుగులో అభిమానులయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: