సినీ నటి రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న ఛావా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ.. 'నేను నా కుటుంబాన్ని ఎంతగానో మిస్ అవుతున్నాను. కెరీర్ కోసం కుటుంబాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఇంకొకటి త్యాగం చేయక తప్పదు అని నాకు ఈ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడే మా అమ్మ చెప్పింది. నా ఫ్యామిలీ తో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను' అని రష్మిక ఎమోషనల్ అయ్యింది.
అయితే రష్మిక, బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ తో నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా టైలర్ రిలీజ్ వేడుక ముంబాయిలో జరిగింది. ఛావా సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని రష్మిక చెప్పుకొచ్చింది.  
ఇక రష్మిక ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత గీత గోవిందం, దేవదాస్, పొగరు, సరిలేరు నికెవ్వరు, భీష్మ, యనిమాల్ సినిమాలు కూడా చేసింది. ఇటీవల ఈ అందాల భామ పుష్ప 2 లో శ్రీవల్లీ పాత్రలో నటించి హిట్ కొట్టేసింది. ఇక రష్మిక మందన్న 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ మూవీ ద్వారా నటిగా పరిచయమమైంది. ఈమెను అక్టోబరు 2024లో కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది.  ఈమె నటనతో చాలా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినప్పటికి.. అంతగా హిట్స్ పడలేదు. కానీ పుష్ప సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఈమె ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో మొత్తం రష్మిక నే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: