రష్మిక మందన్నా.. ఒక నేషనల్ క్రష్ ..ఒక హాట్ బ్యూటీ ..ఒక అందమైన అమ్మాయి.  ఒక టాలెంటెడ్ యాక్టర్స్.  ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు జనాలు . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా అంటే పడి చచ్చిపోయే కుర్రాళ్ళు అంకుల్స్ కూసింత ఎక్కువగానే ఉంటారు . ఆమె నటించే నటన.. డాన్స్ చేసే విధానం.. పెట్టే ఎక్స్ప్రెషన్స్ కుర్రాళ్ళకి బాగా గిలిగింతలు పెడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా పుష్ప2  సినిమాతో మరొక క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక మందన్నా.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాలలో ఆఫర్స్ అందుకొని తన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకుంటుంది .

ఇలాంటి క్రమంలోనే కొన్ని కొన్ని చోట్ల ట్రోలింగ్ కూడా జరుగుతుంది . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో రష్మిక మందన్నాకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నాకి కోపం వస్తే ఏం చేస్తుంది అనే విషయం తెలుసుకొని భలే నవ్వుకుంటున్నారు జనాలు. సాధారణంగా ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది . అందులో డౌట్ లేదు . కొంతమందిని రకరకాలుగా కంట్రోల్ చేసుకుంటారు .

మరి కొంతమందిని గట్టిగా అరిచి ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసేస్తారు . అయితే రష్మిక మందన్నా మాత్రం తనకి పట్టరాని కోపం వచ్చినా అసలు కంట్రోల్ చేసుకోలేని అంత కోపం వచ్చినా వెంటనే రూమ్ లోకి వెళ్లి ఫుడ్ బాగా తినేసి పాటలు వింటూ పడుకునేస్తుందట.  ఆ తర్వాత కోపం తగ్గాక ఎవరిపై ఎందుకు కోపం వచ్చింది అన్నది రియలైజ్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతుందట . ఇది నిజంగా చాలా చాలా మంచి హ్యాబిట్ అంటున్నారు జనాలు . కోపంలో ఏదంటే అది మాట్లాడేస్తాం .. దానివల్ల ఫ్రెండ్షిప్ రిలేషన్స్ దెబ్బతింటాయి.  అయితే రష్మిక మందన్నాలా అందరూ ఫాలో అయితే అసలు ప్రాబ్లమే ఉండదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు..!
 


మరింత సమాచారం తెలుసుకోండి: