ఇన్నాళ్లు అల్లు అర్జున్ సైలెంట్ గా ఉన్నాడు అని అంతా అనుకున్నారు.  కానీ ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు.  గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త షేక్ చేసి పడేస్తుంది . అది కూడా అల్లు అర్జున్ కి సంబంధించినది కావడంతో జనాలు షాక్ అయిపోతున్నారు . నిజంగానే అల్లు అర్జున్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడా..? అంటూ ఆలోచిస్తూ మాట్లాడుకుంటున్నారు . అల్లు అర్జున్ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురైంది.  ఆ విషయం మనందరికీ తెలుసు . అయితే అల్లు అర్జున్ ఇప్పుడు ఆ కేసు నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నారు . అయితే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు అంటూ బాగా వార్తలు వినిపించాయి .

తద్వారా అల్లు అర్జున్ మైండ్ సెట్ మారుతుంది అని.. తన పేరు మళ్లీ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది అంటూ ఫ్యాన్స్ భావించారు . కానీ అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కొన్నాళ్లపాటు హోల్డ్ లో పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  ఆయన మైండ్ సెట్ బాగోలేని కారణంగా ఈ సినిమాను హోల్డ్ లో పెట్టాడు అని కొంతమంది అంటుంటే .. మరికొందరు కొంచెం టైం ఈ హీట్ తగ్గేంత వరకు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారట .

అంతేకాదు జాతకంలో ఉన్న దోషం కారణంగా తల్లి సలహా మేరకు పూజలు కూడా చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . ఇవన్నీ ముగించుకున్నాక ఫ్రెష్ గా లక్కీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలి అనే ఆలోచనలో ఉన్నారట . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . అల్లు అర్జున్ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అంటూ ఆశపడ్డారు ఫ్యాన్స్ కానీ ఇలా మళ్లీ హోల్డ్ లో పెట్టారు అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడం ఇబ్బందికరంగా మారింది . ఇది ఒక రకంగా అల్లు అర్జున్ అభిమానులకు బాడ్ న్యూస్ అనే అంటున్నారు జనాలు..!


మరింత సమాచారం తెలుసుకోండి: