సినీ నటి రష్మిక మందన్న గురించి పరిచయం అనవసరం. ఈమె కాలికి షూటింగ్ లో తీవ్రగాయాలు అయినా విషయం తెలిసిందే. తాజాగా ఆమె కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్లు రష్మిక తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ పోస్ట్ కూడా షేర్ చేసింది. తనకి కాండరాల్లో చీలిక వచ్చినట్లు తెలిపింది. దాని కారణంగా రెండు వారాలుగా నడవలేకపోతున్నట్లు చెప్పింది. ఎక్కడికి వెళ్లి అన్న కూడా ఒక్క కాలితో వెళ్లాల్సి వస్తుందని రష్మిక చెప్పుకొచ్చింది. నాపై మీరందరూ చూపించే ప్రేమ, అభిమానం కారణంగానే తనకి పెద్దగా నొప్పి తెలియడం లేదని.. అందరికీ రుణపడి ఉంటానని రష్మిక సోషల్ వేదికగా రాసుకొచ్చింది.  
ఇక ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత గీత గోవిందం, దేవదాస్, పొగరు, సరిలేరు నికెవ్వరు, భీష్మ, యనిమాల్ సినిమాలు కూడా చేసింది. ఇటీవల ఈ అందాల భామ పుష్ప 2 లో శ్రీవల్లీ పాత్రలో నటించి హిట్ కొట్టేసింది. పుష్ప సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఈమె ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో మొత్తం రష్మిక నే కనిపిస్తుంది. అయితే రష్మిక, బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ తో నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా టైలర్ రిలీజ్ వేడుక ముంబాయిలో జరిగింది. కాలికి గాయం అయినప్పటికీ ఆ ఈవెంట్ కి రష్మిక వచ్చింది.
ఇక రష్మిక మందన్న 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ మూవీ ద్వారా నటిగా పరిచయమమైంది. ఈమెను అక్టోబరు 2024లో కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: