ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, మహేష్ బాబుకి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఆ ఫొటోలో మన సూపర్ స్టార్ తన ట్రైనర్ దగ్గర స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. SSMB29 కోసం మహేష్ బాబు ఇంతలా కష్టపడుతున్నాడా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. యాక్షన్ సీన్స్ లో మహేష్ బాబు అదరగొట్టడం ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
ఇకపోతే రాజమౌళి సినిమా స్టార్ట్ చేసేముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఊహించని ట్విస్టులు ఇస్తాడట. మగధీర, ఈగ, ఆర్‌ఆర్ఆర్ సినిమాల టైమ్ లో కూడా ఇలానే చేశాడు. సినిమా స్టోరీ లైన్ ఏంటి, క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయనే విషయాలని ప్రెస్ మీట్ లో లీక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు SSMB29 కోసం కూడా అలాంటి ప్రెస్ మీట్ ఉంటుందని మహేష్ బాబు ఫ్యాన్స్ వెయిటింగ్. ఈసారి రాజమౌళి ఎలాంటి సీక్రెట్స్ రివీల్ చేస్తాడో అని ఆత్రుతగా ఉన్నారు.
షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయాక ప్రెస్ మీట్ ఉంటుందని టాక్. అంతేకాదు, రాజమౌళి తన ఇన్‌స్టా పోస్ట్ లో షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుందని హింట్ కూడా ఇచ్చేశాడు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా రిహార్సల్స్ లో మునిగిపోయారట. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు.
ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేమిటెంట్.. ఈ సినిమాలో మలయాళ నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇంత టాలెంటెడ్ టీమ్ తో SSMB29 సినిమా మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.