గత ఏడాదిలో సంచలనం సృష్టించిన వార్తల్లో జానీ మాస్టర్ పై లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టడం కూడా ఒకటి. గత ఏడాది జానీ మాస్టర్ కేసు మాత్రం పెద్ద సెన్సేషన్ అయింది. జానీ మాస్టర్ దగ్గర పనిచేసే లేడి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని మైనర్ గా ఉన్న సమయంలోనే తనను పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశాడని షూటింగ్స్ కోసమని బెంగళూరు చెన్నై ముంబై వంటి ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడంటూ ఆరోపించింది.ఈ విషయంలో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి కొద్దిరోజులు జైల్లో కూడా ఉంచారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ నేషనల్ అవార్డు కూడా రద్దు చేశారు. అంతేకాదు డ్యాన్సర్స్ అసోసియేషన్ నుండి కూడా తొలగించారు. అయితే అలాంటి జానీ మాస్టర్ కేసులో మొదటిసారి స్పందించింది లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జానీ మాస్టర్ పై కేసు పెట్టిన సమయంలో చాలామంది నన్ను నిందించారు. అయితే నాకు ఆయనపై కక్ష లేదు.ఎలాంటి పగలేదు.

 కానీ నా ఆత్మగౌరవం కోసం ఆయనపై కేసు పెట్టాను. ఎవరైనా సరే ఒక అమ్మాయిని మానసికంగా శారీరకంగా వాడుకొని ఆ తర్వాత ఆమెను వదిలేసి మరో అమ్మాయితో ఉంటే దాన్ని ఒప్పుకుంటారా..ఈ విషయము నేను సైలెంట్ గా ఉండాలా.. అలా సైలెంట్ గా ఉంటే అది నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టే. నేను ఈ విషయంలో రెండే రెండు ఆలోచించాను.మొదటిది ఎవరి సపోర్ట్ లేకుండా కూడా ధైర్యంగా ముందుకు వెళ్లడం. రెండోది నా లైఫ్ ని వదిలేయడం.కానీ నేను ఇందులో మొదటి విషయాన్ని ఎంచుకొని ధైర్యంగా అడుగులు ముందుకు వేశాను. అయితే నేను జానీ మాస్టర్ పై కేసు పెట్టిన సమయంలో నా వెనుక పెద్ద హీరో ఉన్నారు అని వార్తలు రాసారు. కానీ నా వెనక ఎవరూ లేరు. అల్లు అర్జున్ అంటూ చెప్పారు.కానీ అందరు ఎలాంటి నిజం లేదు.నా వెనక ఎవరూ లేరు నేను ఒంటరి పోరాటం చేస్తున్న న్యాయం జరిగే వరకు పోరాడుతాను.

అలాగే పుష్ప టు సెట్ లో జరిగిన గొడవ గురించి ఇప్పుడు నేను మాట్లాడను. అదంతా కోర్ట్ లోనే తెల్చుకుంటాను. ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో దీని గురించి మాట్లాడడం సబబు కాదు. పుష్ప టు సెట్లో జానీ మాస్టర్ నామీద చేయి చేసుకున్న సమయంలో కొంతమంది డాన్సర్లు కూడా చూశారు.కానీ ఈ విషయాన్ని నేను కోర్టులోనే పూర్తి విషయాలు చెబుతాను. అంటూ శ్రష్టి వర్మ చెప్పుకొచ్చింది.అలాగే మీ కారణంగా ఆయనకు నేషనల్ అవార్డు రద్దయింది అని ప్రశ్న ఎదురవగా డాన్స్ వచ్చి టాలెంట్ ఉంటే మాత్రమే కాదు.క్యారెక్టర్ కూడా ఉండాలి అంటూ కౌంటర్ ఇచ్చింది శ్రష్టి వర్మ..ప్రస్తుతం శ్రష్టి వర్మ మాట్లాడిన మాటలు వింటే మాత్రం శారీరకంగా మానసికంగా ఒక అమ్మాయిని వాడుకొని మరో అమ్మాయితో ఉండడం అంటే శ్రష్టి వర్మతో ఉన్న సమయంలో జానీ మాస్టర్ వేరే అమ్మాయితో కూడా ఉన్నారా లేక ఆమె మాట్లాడిన మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: