నందమూరి నటసింహం బాలకృష్ణ సీనియర్లకు ఎంతో గౌరవం ఇస్తారు. మరీ ముఖ్యంగా మహిళలతో పాటు .. మహిళా హీరోయిన్లు .. తన తండ్రి తరం హీరోయిన్లు అంటే బాలయ్యకు ఎంతో గౌరవం. ఏ సీనియర్ హీరో అయిన బాలయ్య ఎంతో గౌరవిస్తారు .. ప్రేమిస్తారు. తన తండ్రి ఎన్టీఆర్ కు సమకాలీనుడు అయిన మరో లెజెండ్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వరరావు అంటే బాలయ్యకు ఎంతో అభిమానం. తన తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిగా ఏఎన్ఆర్ ను బాలయ్య గౌరవిస్తారు. కారణం ఏమిటో తెలియదు కానీ చివర్లో బాలయ్యకు .. ఏఎన్నార్ కు మధ్య తెలియని గ్యాప్ వచ్చింది. వీరిద్దరూ కలిసి తెర మీద స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నారు. ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలియదు కానీ బాలయ్య ఏఎన్నార్ చనిపోయినప్పుడు కూడా వెళ్లలేదు.
ఏఎన్ఆర్ ఒక సందర్భంలో ఎన్టీఆర్ గురించి బాలయ్య దగ్గర కాస్త తక్కువ చేసి మాట్లాడడంతో బాలయ్య బాధపడ్డారని .. అప్పటినుంచి ఏఎన్ఆర్ కు బాలయ్య దూరమయ్యారని అంటారు. ఈ విషయాన్ని సీనియర్ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఒకటి రెండు సందర్భాలలో ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు బాలయ్య .. ఏఎన్ఆర్ మధ్య గ్యాప్ తగ్గించేందుకు ప్రయత్నించారని .. అయితే ఈ విషయంలో బాలయ్య సుముకత వ్యక్తం చేయకపోవడంతో వాళ్ళు వెనక్కు తగ్గారు అని కూడా చిట్టిబాబు తెలిపారు. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత ఏఎన్నార్ తనయుడు నాగార్జున .. బాలయ్య మధ్య కూడా సరైన సంబంధాలు లేవన్న పుకార్లు ఇండస్ట్రీలో ఉన్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త సుబ్బిరామిరెడ్డి వైజాగ్ లో నిర్వహించిన ఓ సమావేశంలో నాగార్జున ... బాలయ్య సమక్షంలోనే మా ఇద్దరి మధ్య ఏమి లేదని క్లారిటీ ఇచ్చినా కూడా ఆ తర్వాత వీరిద్దరూ సఖ్యతతో ఉన్న సందర్భాలు లేవు.