టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకరు. ఇకపోతే బాలకృష్ణ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. అలాగే కొన్ని బ్లాక్ బాస్టర్ సినిమాలను కూడా వదులుకున్నాడు. ఇకపోతే ఒక సినిమా కథ తన దగ్గరకు రాగా ఆ సినిమా కథ అద్భుతంగా నచ్చిన అది తనపై వర్కౌట్ కాదు అని వేరే హీరో పేరును బాలకృష్ణ సూచించాడట. ఆ తర్వాత ఆ మూవీ నిర్మాతలు ఆ హీరోను సంప్రదించగా ఆయన దానికి ఓకే చెప్పడం , ఆ మూవీ విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడం , ఆ హీరోకు మంచి గుర్తింపు కూడా రావడం జరిగిందట. ఇంతకి ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఓ మలయాళ సినిమాకు రీమిక్. ఇకపోతే ఈ సినిమా రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ వారు కొనుగోలు చేసిన తర్వాత ఇందులో పవన్ కళ్యాణ్ పాత్రకు బాలకృష్ణ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేకర్స్ ఆయనను కలిసి ఈ విషయాన్ని చెప్పారట. దానితో బాలకృష్ణసినిమా కథ మొత్తం విని ఇది నాపై కంటే కూడా పవన్ కి అద్భుతంగా సెట్ అవుతుంది. ఆయనతో ట్రై చేయండి అని చెప్పాడట. దానితో ఆ మూవీ నిర్మాతలు పవన్ ను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం , ఆ మూవీ భీమ్లా నాయక్ అనే టైటిల్ తో రూపొంది విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడం , ఆ మూవీ ద్వారా పవన్ కి మంచి గుర్తింపు రావడం కూడా జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: