టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక క్రేజ్, రేంజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ రష్మిక పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. యానిమల్ సినిమాతో 2023లో రష్మిక బిగ్గెస్ట్ హిట్ అందుకోగా 2024 సంవత్సరంలో పుష్ప2 సినిమాతో విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో రష్మిక ఒకింత బోల్డ్ సీన్స్ నటించి తన నటనతో మెప్పించారు.
 
యానిమల్ సినిమాలో రష్మిక నటించిన కొన్ని సీన్స్ బోల్డ్ గా ఉన్నాయని అప్పట్లో కామెంట్లు వినిపించాయి. అయితే ఆ సీన్లలో తన అద్భుతమైన యాక్టింగ్ తో రష్మిక వావ్ అనిపించారు. రష్మిక తన కెరీర్ లో ఎలాంటి రోల్స్ ను ఎంచుకున్నా ఆ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడం ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు. రష్మిక ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
 
రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. రష్మిక త్వరలో పెళ్లికి సంబంధించిన తీపికబురును సైతం చెబితే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రష్మిక సక్సెస్ కోసం కొన్ని విషయాల్లో రాజీ పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నానని రష్మిక అభిప్రాయపడ్డారు.
 
కుటుంబం నా బలం అని కుటుంబానికి సమయం కేటాయించడం నాకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రష్మిక ఖాతాలో ఏకంగా 5 సినిమాలు ఉండటం గమనార్హం. ఈ స్థాయిలో చేతిలో సినిమాలు ఉన్న హీరోయిన్లు చాలా తక్కువమంది ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రష్మిక కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మరిన్ని విజయాలు ఆమె ఖాతాలో చేరతాయని చెప్పవచ్చు. రష్మికకు తెలుగులో సైతం ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: