నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది.

ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే మంచి కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా దర్శకుడు బాబి , బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా బాబి , బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ... బాలకృష్ణ గారికి ఎలాంటి ఫిల్టర్స్ ఉండవు. ఏది మాట్లాడాలో అది సూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన చాలా కఠినంగా ఉంటారు అని చాలా మంది అంటుంటారు. కానీ అది కఠినత్వం కాదు.

ఆయన ఎదుటి వ్యక్తిపై చూపించే ప్రేమ. ఆయనతో నేను సినిమా చేస్తున్న సమయంలో ఆయన నన్ను మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అని అడిగారు. దానితో నేను , బాలయ్య గారితో నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన ఇన్స్పిరేషన్ తోనే సినిమాల్లోకి వచ్చాను అని చెప్పారు. దానితో ఆయన వెన్ను తట్టి మరీ నన్ను ప్రోత్సహించాడు. ఆయన గొప్ప వ్యక్తి. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. అలా చేయడం వల్ల కొన్ని సందర్భాలలో ఆయన కఠినంగా కనిపించిన ఆయన గొప్ప వ్యక్తి అని బాబి తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: