మహబూబ్ దిల్ సే, శ్రీ సత్య కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ యూత్ ఫుల్ సాంగ్ నువ్వే కావాలి లాంచ్ ఘనంగా జరిగింది. ఈ పాటకి సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, భార్గవ్ రవడ డిఓపి, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ అన్ని తానే అయ్యి ఈ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ సాంగ్ మనీష్ కుమార్ మ్యూజిక్ అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్ వాయిస్ కి ఆయనతో జతకట్టారు. యూరోప్ లోని బార్సిలోన, మెక్సికో, పారిస్ వంటి అద్భుతమైన లొకేషన్స్ లో అందంగా చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోహెల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, సిరి హనుమంత్, గీతు రాయల్ ఇతర బిగ్ బాస్ సెలబ్రిటీలు, క్రియేటివ్ హెడ్ క్రాఫ్ట్లీ చందు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసింది డైస్ ఆర్ట్ ఫిలిమ్స్.
గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ .. నాకు మెహబూబ్, శ్రీ సత్య బిగ్ బాస్ ముందు నుంచే తెలుసు. భార్గవ్ తో నాకు ముందు నుంచే పరిచయం ఉంది. ఈ సాంగ్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పటివరకు నేను చూసిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అన్నిట్లో కల్లా ఇది కచ్చితంగా బెస్ట్ గా నిలబడుతుంది. అద్భుతమైన లొకేషన్స్ లో చాలా బాగా ఈ సాంగ్ ని చిత్రీకరించారు. టీం అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను అన్నారు.
సిరి హనుమంత్ మాట్లాడుతూ .. మెహబూబ్ ది ముందు నుంచి కష్టపడే తత్వం. ఖాళీ దొరికితే ఏ వీడియో సాంగ్ చేయాలనే ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీ సత్య, మెహబూబ్ కలిసి సాంగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సాంగ్ తో మెహబూబ్, శ్రీ సత్య, భార్గవ్, మనీష్ కి మంచి మంచి పేరు తీసుకురావాలని ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
ప్రియాంక జైన్ మాట్లాడుతూ.. సాంగ్ చాలా బాగా ఉంది. ఈ సాంగ్ రిలీజ్ కోసం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నా. ఇవాళ ఈ సాంగ్ ఇంత గ్రాండ్ గా లంచ్ అవడం చాలా ఆనందంగా ఉంది. వాళ్లు ఈ సాంగ్ తీయడానికి ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. ప్రతి ప్రేమ చాలా ఫ్రెష్ గా అందంగా ఉంది. ఈ సాంగ్ ని నేను శివ తో రీ క్రియేట్ చేస్తాను. మహబూబ్, శ్రీ సత్య, భార్గవ్, మనీష్ కి ఈ సాంగ్ మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
కిరాక్ సీత మాట్లాడుతూ.. నాకు ఈ సాంగ్ ముందే చూపించారు. అప్పుడే నాకు అర్థమైంది సాంగ్ పెద్ద సక్సెస్ అవుతుందని. ఒక సాంగ్ కోసం బయట దేశం వెళ్లారు అంటే వర్క్ పైన వాళ్లకు ఉన్న డెడికేషన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కచ్చితంగా ఈ సాంగ్ ని అందరూ సపోర్ట్ చేసి ఏ టీం కి పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
గీతు రాయల్ మాట్లాడుతూ ..మహబూబ్ చాలా డెడికేటెడ్ అండ్ టాలెంటెడ్. ఏ పనైనా రిస్క్ గురించి ఆలోచించకుండా కష్టపడి పూర్తి చేస్తాడు. ఎవరి సపోర్ట్ లేకుండా తనని తాను ప్రూవ్ చేసుకుని ఎదిగిన వ్యక్తి. అందుకే తను చాలా మందికి ఇన్స్పిరేషన్. శ్రీ సత్య బయట నుంచే కాక తన మనసు కూడా చాలా మంచిది. తను కూడా అంతే హార్డ్ వర్కింగ్ అండ్ డిటర్మైండ్ పర్సన్. ఈ సాంగ్ విజువల్ గా చాలా బాగుంది. కచ్చితంగా 10 మిలియన్ వ్యూస్ కొడుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
మణికంఠ మాట్లాడుతూ.. సురేష్ ఈ పాట లిరిక్స్ చాలా బాగా రాశారు. మనీష్ అందించడం మ్యూజిక్ అండ్ తను ఈ పాట పాడిన విధానం సూపర్. భార్గవ్ డైరెక్షన్ అండ్ లొకేషన్ చాలా బాగున్నాయి. మెహబూబ్ అండ్ శ్రీ సత్య కెమిస్ట్రీ చాలా బాగుంది.
అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మెహబూబ్ శ్రీ సత్య చేసింది సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. భార్గవ్ పిక్చరైజేషన్ అండ్ లొకేషన్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మనీష్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ప్రజలు, మీడియా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
సోహెల్ మాట్లాడుతూ.. మహబూబ్ నా దోస్త్. ఈ సాంగ్ ని చాలా కష్టపడి చేశాడు. శ్రీ సత్య, మెహబూబ్ పెయిర్ చాలా బాగుంది. భార్గవ్ పిచ్చరైజేషన్, డైరెక్షన్, ఎడిటింగ్, విజువల్స్ చాలా బాగున్నాయి. మనీష్ అందించడం మ్యూజిక్ చాలా బాగుంది. అందరూ ఈ సాంగ్ ని సపోర్ట్ చేసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
నోయల్ మాట్లాడుతూ.. ఇలా ఇండిపెండెంట్ సాంగ్ చేయడం అంటే చాలా కష్టం. అది కూడా సాంగ్ ని బయట లొకేషన్స్లో ఇంత బ్యూటిఫుల్ గా పిక్చర్ చేశారు టీం. మెహబూబ్, శ్రీ సత్య పెయిర్ చాలా బాగుంది. కచ్చితంగా ఈ సాంగ్ విలియన్స్ వ్యూస్ ని అందుకుంటుంది అని అన్నారు.
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ : మ్యూజిక్ మరియు లిరిక్స్ లో మంచి ఫీల్ ఉంది. యూరోప్ లో చాలా మంచి లొకేషన్స్ లో అద్భుతంగా చూపించారు. మహబూబ్ శ్రీ సత్య పెయిర్ అండ్ కెమిస్ట్రీ చాలా బాగుంది. కచ్చితంగా ఈ సాంగ్ ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
రోల్ రైడా మాట్లాడుతూ : ఇంత బ్యూటిఫుల్ గా బయట దేశంలో ఒక ఇంటిపెండెంట్ సాంగ్ ని చిత్రీకరించడం చాలా బాగుంది. మహబూబ్ పడిన కష్టానికి ఈ సాంగ్ పెద్ద సక్సెస్ అయ్యి ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. శ్రీ సత్య కి ఈ సాంగ్ కచ్చితంగా మంచి సక్సెస్ ఇస్తుంది. మనీష్ అందించడం మ్యూజిక్ చాలా బాగుంది. లిరిక్స్ చాలా బాగున్నాయి. ప్రేక్షకులకు సాంగ్ కచ్చితంగా నచ్చుతుంది అని అన్నారు.
శ్రీ సత్య మాట్లాడుతూ : ఈ సాంగ్ రిలీజ్ కోసం అప్పటినుంచి ఎదురు చూస్తున్నాను. ఈ రోజున మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఎంతమంది ఫ్రెండ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. మా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి బ్లెస్ చేసిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది. మెహబూబ్ తో కలిసి సాంగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సాంగ్ కి నన్ను తీసుకున్నందుకు భార్గవ్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులందరూ ఈ సాంగ్ ని సపోర్ట్ చేసే పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
మహబూబ్ మాట్లాడుతూ : నాకోసం టైం కేటాయించి అడగగానే వచ్చిన నా ఫ్రెండ్స్ సోహెల్, నోయల్, విక్కీ, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, ప్రియాంక ఇలా విచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు బాగుందని ప్రశంసిస్తున్నారు. అడగగానే ఈవెంట్ ని హోస్ట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసిన స్రవంతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈవెంట్ ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ వాళ్ళకి ధన్యవాదాలు. ప్రేక్షకులు కూడా ఈ స్వామిని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.