కోలీవుడ్ నటుడు విశాల్ చాలా సంవత్సరాల క్రితం సుందర్ సి దర్శకత్వంలో మదగజరాజా అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విశాల్ కి జోడిగా అంజలి , వరలక్ష్మి శరత్ కుమార్ లు హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన కొంత కాలానికి ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఇక సినిమా షూటింగ్ పూర్తి అయిన ఈ మూవీ మాత్రం చాలా సంవత్సరాల పాటు విడుదల కాలేదు. ఎట్టకేలకు ఈ మూవీ ని ఈ సంవత్సరం పొంగల్ కానుకగా తమిళ్ భాషలో విడుదల చేశారు.

చాలా సంవత్సరాల క్రితం రూపొందించిన సినిమా కావడంతో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే అని కొంత మంది భావించిన ఈ మూవీ విడుదల తర్వాత అద్భుతమైన కలెక్షన్లను తమిళ బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా ఇప్పటికే కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను జనవరి 31 వ తేదీన తెలుగు భాషలో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా తెలుగు వర్షన్ కి సంబంధించిన చిక్కు బుక్కు అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు.

మూవీ బృందం వారు విడుదల చేసిన ఈ పోస్టర్లో విశాల్ తో పాటు అంజలి , వరలక్ష్మి శరత్ కుమార్ లు కూడా ఉన్నారు. తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన పోస్టర్లో అంజలి , వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరు తమ నడుమందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇలా మొదటి సాంగు తోనే ఈ బ్యూటీలు ఇద్దరు తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనబడుతున్నారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: