నందమూరి నట సింహం బాలకృష్ణ "అఖండ" సినిమా కంటే ముందు వరుసగా అపజయాలను ఎదుర్కొన్నాడు. ఇక అఖండ మూవీ తర్వాత నుండి బాలకృష్ణ వరుస పెట్టి విజయాలను అందుకుంటున్నాడు. అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ హీరో గా రూపొందిన వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి తాజాగా డాకు మహారాజ్ సినిమాలు వరుసగా విజయాలను అందుకున్నాయి. ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 133 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 134 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వాసులు చేసే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాలకృష్ణ కొంత కాలం క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 132 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూడు మూవీల టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 399 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే తాజాగా బాలయ్య , బాబి దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటించాడు  ఈ మూవీ జనవరి 12 వ తేదీన విడుదల అయింది.

సినిమా ఇప్పటికే 132 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ మరికొన్ని రోజులు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే బాలకృష్ణ ఆఖరి 4 సినిమాల ద్వారా 530 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకున్నాడు. డాకు మహారాజ్ సినిమా మరికొన్ని రోజులు మంచి కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది. మరి ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎన్ని కోట్ల వసూళ్లను సాధిస్తుంది అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: