గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీగేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు.. ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.. ఏకంగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు కోలుకోలేని దెబ్బ తీసింది.. దీనితో దిల్ రాజు బ్యానర్ ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా మరో సినిమా చేస్తానని రాంచరణ్ హామీ ఇచ్చారు..

ప్రస్తుతం రాంచరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. ఆస్కార్ విన్నర్ ఏఆర్. రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇదిలా ఉంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారని న్యూస్ బాగా వైరల్ అవుతున్నాయి.. రెహమాన్ తప్పుకోవడంతో దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడంటూ తెగ ప్రచారం జరుగుతుంది..

అయితే ఈ న్యూస్ లో ఎలాంటి నిజంలేదని చిత్ర యూనిట్ చెబుతుంది..రెహమాన్ లాంటి టాలెంటెడ్ కంపోజర్ ఈ సినిమాకు పని చేయడం మా అదృష్టమని చిత్ర యూనిట్ చెబుతుంది.ఇప్పటికే ఆయన ఇచ్చిన మొదటి ట్యూన్స్‌ అదిరిపోయాయని.. ఈ సినిమాకు ఆయన అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నారని సమాచారం.. బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి “పెద్ది” అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టె ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: