ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి సంస్థ వారు పుష్ప పార్ట్ 2 అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యొక్క మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఇక ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

దానితో ఈ మూవీ ఇప్పటికే అదిరిపోయి రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి అనేక కొత్త కొత్త రికార్డులను సృష్టించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ ఇప్పటికీ కూడా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతూ ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. ఇకపోతే ఆఖరి 24 గంటల్లో ఈ మూవీ కి బుక్ మై షో లో అద్భుతమైన సేల్స్ జరిగాయి. ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకు సంబంధించిన 12.24 కే టికెట్స్ సెల్ అయ్యాయి.

చాలా రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా కొత్త సినిమాల దాటిన తట్టుకొని కూడా భారీ కలెక్షన్ లను వసూలు చేస్తూ అద్భుతమైన రన్ ను బాక్సా ఫీస్ దగ్గర కొనసాగిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... ఫహద్ ఫాజిల్ ,  రావు రమేష్ , అనసూయ , సునీల్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి శ్రీ లీలా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ స్పెషల్ సాంగ్ ద్వారా ఈ నటికి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa