జూనియర్ ఎన్టీఆర్ కోట్లాదిమంది జనాలు ఇష్టపడి ఆరాధించే ఒక తెలుగు హీరో .జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ఆయన మంచితనం గురించి ఆయన డ్యాన్స్ గురించి.. ఆయన నీతి నిజాయితీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్క తెలుగు అభిమానికి ఆయన గురించి తెలిసిందే . మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ని చాలామంది జనాలు పర్సనల్గా కూడా లైక్ చేస్తూ ఉంటారు . సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరోని హీరోగానే లైక్ చేస్తూ ఉంటారు అభిమానులు .

ఆయన డాన్స్ ..నటన.. స్టైల్.. ఏదైనా ఇష్టం కారణంగా ఫాలో అవుతూ ఇష్టపడుతుంటారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రం ఆయన పర్సనల్ ఇమేజ్ కారణంగా ఇష్టపడుతూ ఉంటారు . జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచి మనసు కల హీరో అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా ఎమోషనల్ పర్సన్ అన్న విషయం ఆయన నాన్నగారు మరణించిన మూమెంట్ లోనే బయటపడింది . హరికృష్ణ మరణించిన మూమెంట్లో ఆయన "అరవింద సమేత వీర రాఘవ" ఈవెంట్ లో ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యారో స్టేజ్ పైనే ఏడ్చేశారో మనకు తెలిసిందే.

అప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ఇంత ఎమోషనల్ పర్సన్ అన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ టీవీలో ఒక సినిమాను చూసిన ఏడుస్తూనే ఉంటారట.  బాగా ఎమోషనల్ గా ఫీల్ అయిపోతారట . ఆ మూవీ మరేదో కాదు "సింహరాశి". ఎస్ సింహరాశి మూవీ చాలా చాలా ఎమోషనల్ గా ఉంటుంది.  మరీ ముఖ్యంగా "సన్ - మదర్" సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. కాగా ఆ సీన్స్ చూస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఎందుకో ఎమోషనల్ గా అయిపోతారట . ఆ మూవీ ని గుర్తు తెచ్చుకొని బాగా డల్ గా ఉండిపోతారట.  ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మా అన్న బాగా ఎమోషనల్ పర్సన్ అందుకే ఆయనను అందరూ నమ్మించి మోసం చేస్తూ ఉంటారు అంటూ మాట్లాడుతున్నారు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: