సోనీయా అగర్వాల్ కెరియర్ లో కూడా ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఈ సినిమాకి ముందు సోనియా అగర్వాల్ ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. 7/G బృందావన్ కాలనీ సినిమాతో మాత్రమే విపరీతంగా పాపులారిటీ దక్కించుకుంది. 7/G బృందావన్ కాలనీ సినిమాలో రవి కృష్ణ హీరోగా నటించారు. 7/G బృందావన్ కాలనీ సినిమా 2004లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
భువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించగా.... అరవింద్ కృష్ణ సినిమాటోగ్రఫీ చేశారు. కాగా, 7/G బృందావన్ కాలనీ సినిమా లో సోనియా అగర్వాల్ కాస్త రొమాంటిక్ సన్నివేశాలలో నటించింది. ఈ సినిమాలో సోనియాను చూసిన అభిమానులు ఒకప్పుడు ఎంతో పద్ధతిగా, అమాయకంగా నటించిన సోనియా అగర్వాల్ ఇప్పుడు ఇలాంటి బోల్డ్ సన్నివేశాలలో నటించడం చూసి షాక్ అయ్యారు. అసలు సోనియానేనా ఇలాంటి సన్నివేశాలలో నటించింది అని కొంతమంది కామెంట్లు చేశారు.