మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించిన పలు అప్డేట్స్ ఈమధ్య అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.. అందులో భాగంగానే దర్శకుడు రాజమౌళిసినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోందని సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అందులో సింహాన్ని లాక్ చేసి పాస్పోర్ట్ తీసుకున్నట్లు రాజమౌళి వీడియో షేర్ చేశారు
ఈ వీడియో చూసిన తర్వాత  మహేష్ బాబు కూడా ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను అంటూ కామెంట్ చేశారు.  దీనికి ప్రియాంక చోప్రా,  నమ్రత శిరోద్కర్ కూడా కామెంట్లు చేసిన విషయం తెలిసింది.

ఇక దాదాపు ఇందులో  ప్రియాంక చోప్రా ఫిక్స్ అయిపోయింది. ఇక మరొకవైపు హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకులను అలరించిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తోంది..ఇప్పుడు ఏకంగా రాజమౌళి-  మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా కోసం ఎంత పారితోషకం తీసుకుంటోంది అని అభిమానులు సైతం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం హాలీవుడ్లో సినిమాలు , వెబ్ సిరీస్ లు చేసుకుంటూ బిజీగా మారిన ఈమె అక్కడ ఒక్కో ప్రాజెక్ట్ కి రూ.45 కోట్ల వరకు తీసుకుంటుందట. మరి అంత తీసుకునే ఈమె రాజమౌళి,  మహేష్ బాబు సినిమాకి ఎంత డిమాండ్ చేసింది అనే విషయానికి వస్తే.. రూ.80 కోట్లు ముట్ట చెప్పాల్సిందేనని చెప్పారట.  అయితే రాజమౌళి మాత్రం ఈమెకు రూ. 30 కోట్ల వరకు మాత్రమే ఆఫర్ చేయడంతో బల్క్ గా రెండేళ్లు డేట్స్ అడిగారట.  మరి ఆ ప్రపోసల్ కు ప్రియాంక ఒకే చెప్పిందా లేదా అనేది తెలియాల్సి ఉంది


ఏది ఏమైనా రాజమౌళి మూవీకి రూ.80 కోట్లు రెమ్యూనరేషన్ అంటే స్టార్ హీరో రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే అని చెప్పాలి. మరి రాజమౌళి చెప్పిన రేటుకి ఫిక్స్ అయ్యిందా లేక ప్రియాంక చెప్పిన రేటుకి వీరు ఫిక్స్ అయ్యారా అన్నది తెలియాలి. ఇకపోతే ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్ తో నారాయణ నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: