రవితేజ పుట్టినరోజు సందర్భంగా మాస్ జాతర మూవీ నుంచి గ్లింప్స్ విడుదల కాగా ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. భాను భోగవరపు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. రవితేజ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. 60 సెకన్ల నిడివితో ఉన్న ఈ గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.
మాస్ జాతర మూవీ మే నెల 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. విశ్వంభర మూవీ ఇదే తేదీకి రిలీజ్ కానుందని ప్రచారం జరగగా ఆ సినిమాకు బదులుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. మాస్ జాతర మూవీ గ్లింప్స్ లో రవితేజ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. మాస్ జాతర మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్నో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని తెలుస్తోంది.
మాస్ జాతర మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని సంచలన రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి. మాస్ జాతర కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి