ప్రతి సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇస్తున్న వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన మొదటి సినిమాతో మంచి విజయాలు , మంచి క్రేజ్ లభిస్తూ వస్తున్నాయి. ఇకపోతే కొంత మంది నటీ మణులు నటించిన మొదటి సినిమాతో మంచి గుర్తింపు రాకపోవడం వల్ల ఇండస్ట్రీ నే వదిలేసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మధురిమ తూలి ఒకరు. ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం జగపతి బాబు , జెడి చక్రవర్తి నటించిన హోమం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకుంది. ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. దానితో ఈమె వరస పెట్టి తెలుగులో సినిమాలు చేస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ హోమం సినిమా తర్వాత ఈమె తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ఇక ఈమెకు హోమం సినిమా తర్వాత హిందీ సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయింది. దానితో ఈమె చాలా కాలం పాటు హిందీ సినిమాల్లో నటిస్తూ కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగించింది.

అలాగే పలు ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించింది. ఇక హిందీ సీరియల్స్ లో కూడా ఈమె నటించింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: