టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు ఆఖరుగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త విఫలం అయింది.

అయిన కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో శ్రీ లీల , మీనాక్షి చౌదరి , మహేష్ కి జోడిగా నటించగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే మహేష్ తన తదుపరి మూవీ ని ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ ని ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని కే ఎల్ నారాయణ నిర్మించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా స్టార్ట్ కాక ముందే ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే పైన ఫోటోలో మహేష్ బాబు తో పాటు ఓ పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు తాజాగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రమ్య పసుపులేటి. ఈమె తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఈమె ఇప్పటికే నటించిన సినిమాల్లో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: