సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోలు కెరియర్ ప్రారంభం నుండే సినిమాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. ఇక మరి కొంత మంది కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉంటారు. వాటి ద్వారా వారికి పెద్దగా గుర్తింపు రాదు. ఇక వారు ఒక స్థాయికి వచ్చి మంచి ఈ ను సంపాదించుకున్నాక పలాన సినిమాలో పలాన నటుడు నటించాడు అని న్యూస్ వైరల్ అవుతూ ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి గుర్తింపు కలిగిన హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో నితిన్ ఒకరు. ఇకపోతే నితిన్ నటించిన ఓ సినిమాలో నిఖిల్ ఓ చిన్న సన్నివేశంలో కనిపించాడు. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

నితిన్ , తేజ దర్శకత్వంలో రూపొందిన జయం అనే మూవీ తో హీరో గా కెరియర్ను మొదలు పెట్టారు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఈయన హీరోగా నటిస్తూ అనేక విజయాలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే నితిన్ కొన్ని సంవత్సరాలు క్రితం సంబరం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ఈ సినిమాలో ఓ చిన్న సన్నివేశంలో నిఖిల్ కూడా కనబడతాడు. నిఖిల్ ఆ సన్నివేశంలో నితిన్ తో మాట్లాడుతాడు. కానీ అప్పటికి నితిన్ కు పెద్దగా క్రేజ్ లేకపోవడంతో ఆయనను ఎవరు పట్టించుకోలేదు. ఇక ఈ మధ్య కాలంలో ఆ సన్నివేశం బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం నితిన్ , నిఖిల్ వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: