సినిమా ఇండస్ట్రీలో ఒకరు రిజెక్ట్ చేసిన స్టోరీలో మరొకరు హీరోగా నటించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఓ సినిమా కథను ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేయగా అందులో ఓ తమిళ నటుడు హీరో గా నటించగా ఆ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక అదే సినిమాను ఓ హిందీ నటుడు బాలీవుడ్ లో రీమిక్ చేయగా ఆ మూవీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంతకు ఆ సినిమా ఏది ..? ఆ మూవీ కథను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరోలు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సూర్య హీరోగా ఆసిన్ , నయనతార హీరోయిన్లుగా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో గజిని అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే మురగదాస్ మొదట టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ కు ఈ మూవీ స్టోరీని వినిపించాడట. ఆయన ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఇదే కథను మహేష్ బాబు కు వినిపించగా ఆయన కూడా ఈ మూవీ కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత సూర్య కు ఈ మూవీ కథను వినిపించగా ఆయన మాత్రం ఈ సినిమాలో హీరోగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక గజిని అనే టైటిల్ తో ఈ మూవీ ని మురుగదాస్ రూపొందించి తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల చేయగా ఈ మూవీ రెండు భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇలా తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను ఏ ఆర్ మురుగదాస్ , అమీర్ ఖాన్ హీరో గా హిందీ లో రీమేక్ చేశాడు. ఈ మూవీ హిందీ బాక్సాఫీస్ దగ్గర కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఈ స్టోరీలో సూర్య మొదట హీరోగా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా , ఆ తర్వాత ఈ సినిమా హిందీ రీమిక్ లో నటించిన అమీర్ ఖాన్ కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: