తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో , ముఖ్య పాత్రలలో , విలన్ పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకొని మంచి విజయాలను అందుకొని ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు కొనసాగిస్తున్నాడు. ఇకపోతే రవితేజ 2004 వ సంవత్సరం చంటి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

మంచి అంచనాల నడవ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ సినిమాలో రవితేజ కు జోడిగా ఛార్మీ , డైసీ బోపన్న నటించారు. ఈ సినిమా ఫ్లాప్ కావడం తో ఈ మూవీ ద్వారా డైసీ బోపన్న కి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈమె ఆ సినిమాలో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఈమెకు మంచి అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె బింబ , భగవాన్ , గరమ్ మసాలా , జాక్‌ పాట్ ,  తవారిన సిరి వంటి సినిమాల్లో నటించింది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకోలేక పోతుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దు గుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు ఈ నటికి సంబంధించిన ఫోటోలు సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. అలా ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో బాగానే టచ్ లో ఉంటూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: